పశ్చిమ గోదావరి | ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

by Thanuru Gopichand |

ఫిటిండియా (Fit India) కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో (Tanuku) మారథాన్ నిర్వహించారు.

పశ్చిమ గోదావరి | ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిటిండియా (Fit India) కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో (Tanuku) మారథాన్ నిర్వహించారు. భారతీయ విద్యా భవన్, తణుకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. యువత, ఔత్సాహిక రన్నర్లు అధిక సంఖ్యలో మారథాన్ కు తరలివచ్చారు. తెల్లవారుజామునే ప్రారంభమైన రన్ 3కె, 5కె, 10కె విభాగాల్లో సాగింది. గతేడాది కూడా తణుకు రోడ్ రన్ ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, ఫిట్నెస్ పై అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా తణుకు రోడ్ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది రన్ కు కొనసాగింపుగా ఈ ఏడాది సెకండ్ ఎడిషన్ నిర్వహించామని తెలిపారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ రన్ యువతో ఫిట్నెస్, ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను కనబరిచాయన్నారు.

రన్ లో పాల్గొన్న వారిని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. యువత తప్పనిసరిగా ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉదయం వ్యాయామకం తప్పకుండా చేయాలన్నారు. ప్రతిరోజూ నడక వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. మారథాన్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యం సంరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు దోహదపడతాయన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందన్నారు. పేదలకు ఆర్థిక చేయూతను అందిస్తోందన్నారు. అందులో భాగంగా చాలా మంది పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తోపుడు బల్లు పంపిణి చేశామన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

Next Story