- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతమనేని ప్రభాకరే ఎమ్మెల్యే అభ్యర్థి: టీడీపీ సమన్వయ కమిటీ తీర్మానం
దెందులూరు నియోజకవర్గానికి చింతమనేని ప్రభాకరే తమ నాయకుడని, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆయనేని అని దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు స్పష్టం చేశారు...

X
దిశ, ఏలూరు: దెందులూరు నియోజకవర్గానికి చింతమనేని ప్రభాకరే తమ నాయకుడని, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆయనేని అని దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు స్పష్టం చేశారు. చింతమనేనిపై కొంతమంది ప్రాధాన్యత లేని టీడీపీ, జనసేన నాయకులు పొంతన లేని ప్రకటనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రకటనల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పారు. దెందులూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ శుక్రవారం దుగ్గిరాలలో చింతమనేని గృహం వద్ద మీడియా సమావేశం నిర్వహించింది. టీడీపీ, జనసేనతో సంబంధం లేని వ్యక్తులు సొంతంగా మీడియా సమావేశాలు పెడుతూ చింతమనేనిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తమ అధిష్టానాన్ని కోరతామని హెచ్చరించారు.
Next Story






