- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pig Fighting: కోళ్లే కాదు.. పందులు తన్నుకుంటాయి.. ఇవేం పోటీలు బాబు.. ఓ సారి లుక్కేయండి!
Pig Fighting: సంక్రాంతి(Sankranti ) పండగ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, రేగుపండ్లు, కోళ్ళపందెలు. ఏపీలో కోళ్ల పందేలు బాగా ఆకట్టుకుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranti ) పండగ అనగానే కోళ్లపందేలు గుర్తుకు వస్తాయి. తెలుగువాకిళ్లు రంగవల్లుల అలంకారాలతో ఎంతో ఆకట్టుకుంటాయి. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కోళ్ల పందేలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ కోళ్ల పందేల(Cock Fighting)లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో ఈసారి కోళ్ల పందేలు భారీగా జరిగాయి. అధికారపార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు పందేలు జోరుగా కాశారు.
అయితే కోళ్లపందేలతో పాటు గుండాట, పేకాట, లాటరీ, జూదం వంటి పోటీలు కూడా జరిగాయి. ఈ పోటీలకు తామేమీ తీసిపోమంటూ ఏపీలోని పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా తాడేపల్లి గూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు (Pig races ) ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆయా జిల్లాల నుంచి పందెంరాయుళ్లు తమ పందులతో గ్రామానికి వచ్చారు.
ప్రతిఏటా సంక్రాంతి పండగకు ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలు నిర్వహిస్తుంటారట. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందినవారికి భారీ బహుమతులు కూడా అందజేశారు. కోళ్ల మాదిరిగా జంతువులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు.






