- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tanuku: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్
by Vemula.Srinu Prasad |
పశ్చిమగోదావరి జిల్లా తణుకు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ...

X
దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా తణుకు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాడేరులో గంజాయిని కొనుగోలు చేసి తణుకులో విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తణుకు రూరల్ పోలీసులు దాడి చేశారు. తణుకు రూరల్ ఎస్ఐ గురయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన పంచదార స్నేహ సత్య సాయి ఫణి, కొర్రా తేజ, ఖండవల్లి జయ వెంకట సాయి శ్రీతేజ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఆంజనేయులు వెల్లడించారు. యువకులు కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. చెడు వ్యసనాలకు లోనవుతుండడంతో పాటు ప్రమాదకరమైన డ్రగ్స్‌కు యువత అలవాటు పడుతున్నారని సీఐ ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






