- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: అక్కడి నుంచే పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర.. షెడ్యూల్ ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే....

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో విడత యాత్రపై దృష్టి సారించారు. ఈ నెల 9న ఏలూరు నుంచి వారాహి యాత్ర పున:ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌ను పవన్ కల్యాణ్, పార్టీ నేతలు ఖరారు చేశారు. జులై 6,7,8 తేదీల్లో రాజమండ్రిలో ముఖ్యనేతలతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు. వారాహి రెండో విడత యాత్రను ఏ తారీకు వరకు కొనసాగించాలి, ఎన్ని సభల్లో ప్రసంగాలి, ర్యూట్ మ్యాప్ వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం రెండో విడత ముగింపు తేదీ ప్రకటించనున్నారు. అంతేకాదు యాత్ర సాగే ప్రాంతాలను కూడా ప్రజలకు తెలపనున్నారు.
ఇక 9వ తేదీన పున:ప్రారంభించే వారాహి యాత్ర కోసం జనసేన కార్యకర్తలు, నేతలు కసరత్తు చేస్తోంది. తొలి విడత యాత్ర విజయం కావడంతో జనసైనికుల్లో మరింత జోష్ నెలకొంది. దీంతో రెండో విడత వారాహి యాత్రను కూడా రెట్టింపు విజయం చేయాలని భావిస్తున్నారు. తమ అభిమాన నేత వారాహి యాత్రకు వస్తున్న స్పందన చూస్తే ఈ సారి పవన్ కల్యాణ్ సీఎం అవడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.






