- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. డీఎస్పీ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఎస్పీ
by Vemula.Srinu Prasad |
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో డీఎస్పీ వ్యవహారంపై ఎస్పీ విచారణ చేపట్టారు...

X
దిశ, వెబ్ డెస్క్: భీమవరం డీఎస్పీ జయసూర్య(Bhimavaram DSP Jayasurya) వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. సివిల్ వివాదాల్లోనూ ఆయన వేలు పెడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)కు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో పవన్ కల్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు. పేకాట, కోడి పందాలకు అనధికార అనుమతులు ఇవ్వడంపై సీరియస్ అయ్యారు. కూటమినేతల్లో కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా డీఎస్పీ జయసూర్య వ్యవహరించారనే ఆరోపణలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో వెంటనే భీమవరం డీఎస్పీపై శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ సందర్శంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు.
Next Story






