- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్ : అత్తింటివారు అనుమానించారన్న కోపంతో నవ వధువు ఆత్మహత్య చేసకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని భీమవరం పట్టనంలోని గనుపూడి రజకుల వీధికి చెందిన ఇట్టా శ్రీమణి భీమవరానికి చెందిన శివను నాలుగు నెలలక్రితం వివాహం చేసుకుంది. అయితే ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి వివాహ బంధంలో కుంకుమ భరణి తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే తమ అత్తింటిలో కుంకుమ భరణి పోవడంతో.. కొత్త కోడలును ఆరా తీశారు కుటుంబ సభ్యులు. దీంతో తనను అనుమానించారని మనస్థాపం చెందిన శ్రీమణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






