తాగిన మత్తులో కరెంట్‌ స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్.. చివరికి ఏమైందంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-08 14:52:16  IST  )

తాగిన మత్తులో లారీని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ శ్రీవారి కొండపైకి వెళ్లే ఆర్చిగేటు కూడలిలోని విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు

తాగిన మత్తులో కరెంట్‌ స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్.. చివరికి ఏమైందంటే?
X

దిశ, ద్వారకాతిరుమల: తాగిన మత్తులో లారీని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ శ్రీవారి కొండపైకి వెళ్లే ఆర్చిగేటు కూడలిలోని విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు. దీంతో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అటు ఏ విధమైన వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమల కు వచ్చిన లారీ కామవరపుకోట వైపు వెళ్లబోయి.. కొండపైకి వెళ్లే ఆర్చిగేటు వద్దకు వచ్చింది. మళ్లీ కామవరపుకోట కి వెళ్లే క్రమంలో లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అమాంతం రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు. విద్యుత్ వైర్లు షార్ట్ అయ్యి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు.

Next Story