- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eluru: నూజివీడుకు సీఎం జగన్.. అప్రమత్తమైన ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు..

దిశ, ఏలూరు/నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను గురువారం నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. నూజివీడు – విస్సన్నపేట ప్రధాన రహదారిలోని జగనన్న టౌన్ షిప్ స్ధలంలో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం మైలవరం రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే రహదారిలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిట్టింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు.






