- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ycp: జనసేన ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు...

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైనట్లు సీఎం ప్రకటనలో తెలిపింది.రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇకపోతే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన కుమారుడి వివాహ పత్రికపై వెస్ జగన్, వైఎస్ భారతి దంపతుల ఫోటోలను ప్రచురించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదంతో అంటూ శుభలేక ప్రచురించడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.






