నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

by Disha Web Desk 18 |
నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు
X

దిశ, ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ, స్టేషన్ రైటర్ లను, జీప్ డ్రైవర్ ను లంచం తీసుకుంటున్నారని ఆరోపణ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు.రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ, ఏలూరు ఇంఛార్జి శ్రీహరి రాజు నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బాధితుడు, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి పై అతని భార్య వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారని సెక్షన్ 498 కేసు పెట్టిందన్నారు.

ఈ కేసులో బాధితుడిని బయటపడేసేందుకు స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్ 25 వేల రూపాయల లంచం అడిగారు. గత మూడు నెలలుగా ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు సాగర్ ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక మేరకు స్టేషన్ కు వెళ్లిన బాధితుడు ఎస్ఐ కి డబ్బు ఇచ్చేందుకు యత్నించగా, జీప్ డ్రైవర్ ప్రసాద్ కు ఇవ్వాలని ఎస్సై, రైటర్ చెప్పారని డీఎస్పీ వివరించారు. దీనిపై డ్రైవర్ ప్రసాద్ కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 25 వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకుని ఎస్సై, రైటర్, జీప్ డ్రైవర్ లపై కేసు నమోదు చేశామని చెప్పారు.



Next Story

Most Viewed