- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సెల్ఫ్ ఎన్యూమరేషన్ పై 5కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్ సందడి!
రంపచోడవరంలో 'సెల్ఫ్ ఎన్యూమరేషన్'పై అవగాహన 5కే రన్! డిజిటల్ సెన్సెస్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపు.

దిశ, రంపచోడవరం: పోలవరం జిల్లా డిజిటల్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ‘సెల్ఫీ ఎన్యూమరేషన్’ను ప్రోత్సహించేందుకు సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి డివిజనల్ అటవీ శాఖ కార్యాలయం వరకు 5కే రన్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటి సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి సహా ఇతర ముఖ్య పరిమితుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
సేకరించిన డేటా ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని ఆయన చెప్పారు.ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘సెల్ఫీ ఎన్యూమరేషన్‌లో పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని కోరుతూ,ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని,అందరూ బాధ్యతగా పాల్గొని జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.






