- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమ గోదావరి | విద్యార్థినిని అనుమతించని స్కూల్ యాజమాన్యం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని (Narsapuram) సికెలే స్కూల్ యాజమాన్యం తీరు వివాదానికి దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని (Narsapuram) సికెలే స్కూల్ యాజమాన్యం తీరు వివాదానికి దారితీసింది. భవానీ మాల ధరించిన ఒక నాలుగో తరగతి విద్యార్థినిని పాఠశాల లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర ఆందోళన చోటుచేసుకుంది. పాఠశాల నిబంధనలకు విరుద్ధమనే కారణంగా విద్యార్థినిని ఆపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, ఇతర భవానీ భక్తులు కలిసి పాఠశాల ప్రధాన ద్వారం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ బిడ్డ మతపరమైన ఆచారాన్ని పాటించడాన్ని అడ్డుకోవడంపై తల్లిదండ్రులు, భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన పిల్లలను తరగతికి అనుమతించకపోవడం సరికాదని, వెంటనే విద్యార్థినిని లోపలికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో, స్కూల్ యాజమాన్యం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో, విద్యార్థినిని తరగతికి అనుమతిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.






