- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:డిప్యూటీ సీఎం పవన్‌కు అమరావతి రైతుల నీరాజనం..
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాజధాని అమరావతికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అక్కడి రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాజధాని అమరావతికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అక్కడి రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సచివాలయం వరకు పూలవర్షం కురిపిస్తున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. అమరావతిలో అడుగుపెట్టిన ప్రాంత రైతుల నుంచి పవన్‌కు ఘన స్వాగతం లభించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. కౌలు ఇప్పించడంలో జగన్ జాప్యం చేస్తే పవన్ పోరాడి రెండు సార్లు ఇప్పించారని రైతులు చెబుతున్నారు. మాకు సానుభూతి తెలిపేందుకు వస్తే ఇనుప కంచె వేసి పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టారని మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. ఆయనకు స్వాగతం పలికేందుకు 10 టన్నుల పువ్వులు తెప్పించాం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కోసం ముళ్లకంచెలు సైతం అధిగమించిన ఆయనను రేపు పువ్వుల పై నడిపిస్తాం అని రైతులు చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ వెలగపూడి సచివాలయం చేరుకోనున్నారు.
Read More..
ఏపీ ప్రజల మనసులు తేలికపడ్డాయి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు






