ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది....

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) బిగ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం(Rain) పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు 27 మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎండ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Next Story