కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం : మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

తెలుగుదేశం పార్టీకి (Telugu Desham Party) అండగా నిలిచిన కురుబ సోదరులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని

కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీకి (Telugu Desham Party) అండగా నిలిచిన కురుబ సోదరులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ (Minister Lokesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ... తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు అన్ని విధాలుగా టీడీపీకి అండగా నిలిచారన్నారు. ఇప్పుడు మేము బీసీలను బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కృషిచేస్తున్నామని ప్రకటించారు. మహా భక్తుడు కనకదాస జయంతి (Kanakadasa Jayanthi) సందర్భంగా భక్త కనకదాస విగ్రహావిష్కరణ చేయడం, కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం తన జీవితంలో మార్చిపోలేని రోజుగా అభివర్ణించారు. ఒకే రోజు మూడు పండుగలను కురుబ సోదరులతో కలిసి జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నామనన్నారు.

భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేస్తాం

భైరవానితిప్ప ప్రాజెక్టుకు (Bhairavani Tippa Project) శంకుస్థాపన చేసింది టీడీపీ, పూర్తిచేసేది కూడా టీడీపీనే అని మంత్రి లోకేష్ కుండబద్ధలు కొట్టారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. కరువుసీమలో కార్ల పంట పండించిన చరిత్ర టీడీపీదన్నారు. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పుడు పరిశ్రమలు తెస్తున్నామన్నారు. జిల్లాలో హార్టికల్చర్ కు సాయం అందిస్తామన్నారు. తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకొస్తామన్నారు.

అనంతపురం జిల్లాకు రుణపడి ఉంటాం

ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లాకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ ను 3సార్లు శాసనసభకు పంపించింది కూడా అనంతపురమేనని గుర్తు చేసుకున్నారు. తన మామ నందమూరి హరికృష్ణ ఒకసారి గెలిపించారు, మరొక మామ బాలకృష్ణను మూడుసార్లు గెలిపించి శాసనసభకు పంపిన గొప్పనేల అనంతపురం అని కొనియాడారు. ఈ నేలకు తాము ఎంతచేసినా తక్కువేనన్నారు. తమ జీవితాంతం అనంతపురంవాసులకు రుణపడి ఉంటామన్నారు. అనంతపురం అంటే టీడీపీ, టీడీపీ అంటేనే అనంతపురం అని నినదించారు. టీడీపీని కురుబలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్యం వచ్చింది టీడీపీతోనే. కురుబ సోదరులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.

వైసీపీ హయాంలో చీకటిరాజ్యం

2019 నుంచి 2024 వరకు చీకటి రాజ్యం (Dark Days) చూశామని మంత్రి లోకేష్ అన్నారు. మన బిడ్డలపై పెట్రోలు పోసి తగులబెట్టారని, బీసీ సోదరుల్లో తిరుగుబాటు వచ్చిందని గుర్తు చేశారు. 94శాతం సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు.

Next Story