- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి ప్రాంతంలో జరీబు.. గ్రామ కంఠం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి ప్రాంతంలో జరీబు.. గ్రామ కంఠం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన త్రిమెన్ కమటీ సమావేశం శనివారం జరిగింది. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, భూసేకరణ, రాజధాని రైతుల భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ జరీబు (Jareebu), గ్రామ కంఠం (Grama Kantam) భూముల సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. అందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా మరో 15 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటాని ప్రకటించారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండడానికి రైతులు సుముఖతను వ్యక్తం చేయడం హర్షణీయమన్నారు. రాజధాని పట్ల వారికి ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
మరోవైపు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కేవలం 7,628 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను కూడా త్వరగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఉండవల్లి రైతులకు ప్లాట్ల కేటాయింపు త్వరలో లాటరీ విధానం ద్వారా జరగనుందని ప్రకటించారు. ఆర్5 జోన్‌పై ప్రభుత్వ విధానంపై స్పష్టతనిస్తూ పారదర్శకమైన, న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి చట్టపరమైన అభిప్రాయం (Legal opinion) తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని నిర్మాణంతో పాటు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.






