పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తాం : మంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 07:31:04  IST  )

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.

పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తాం : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రంలో ఉన్న పర్యాటక రంగం (AP Tourism) అవకాశాలను ప్రపంచానికి చాటి చెబుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. కొండకర్ల ఆవలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవ్ ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ప్రారంభించారు. అనంతరం కొండకర్ల ఆవలో పర్యాటక ప్రాంతాలను పరిశీలించి బోటు షికారుకు వెళ్లారు. ఏటికొప్పక బొమ్మల తయారీ, పెయింటింగ్ పై చిన్నారులకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన experiential టూరిజం కేంద్రాలను ప్రారంభించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలతో ఏపీలో పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తామన్నారు. రాష్ట్రానికి సుమారు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని పేర్కొన్నారు. సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. వేల సంవత్సరాల చారిత్రక చిహ్నాలున్నాయని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని ప్రకటించారు. గతంలో మచిలీపట్నంలో బీచ్ ఫెస్ట్ నిర్వహించామని గుర్తు చేశారు. విజయవాడలో ఆవకాయ్ బిర్యానీ ఉత్సవ్ నిర్వహించామన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నాని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల సంతోషానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Next Story