- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లోఅవుట్ బాధితులకు పరిహారం అందిస్తాం : ఎంపీ హరీశ్
విజయవంతంగా విపత్తును నివారించిన నిపుణులు.

దిశ, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ (Blow Out) మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఓఎన్జీసీ (ONGC) విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. అందుకోసం పూర్తిగా దేశీయ టెక్నాలజీని వినియోగించింది. ఇప్పటికే వెల్ క్యాపింగ్ పనులను కూడా పూర్తి చేసింది. ఈ క్రమంలో నిపుణుల బృందం సంబరాలను జరుపుకుంది. దీనిపై అమలాపురం ఎంపీ జీఎం హరీశ్ బాలయోగి (MP Harish) స్పందించారు. విపత్తు నివారణ బృందం వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అతితక్కువ సమయంలోనే బ్లోఅవుట్ ను నియంత్రించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విపత్తును విజయవంతంగా నివారించిన నిపుణుల బృందాన్ని, సిబ్బందిని ఎంపీ అభినందించారు. వారి అప్రమత్తత, నైపుణ్యం కారణంగా గ్రామానికి పెను ప్రమాదం తప్పిందన్నారు. అహర్నిశలు వారు చేసిన కృషి సదా అభినందనీయం అన్నారు. అయితే బ్లోఅవుట్ కారణంగా పలువురు నష్టపోయారని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇటువంటివి మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.






