- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, జరుగుతున్న ప్రగతి ప్రజలందరికీ కనిపించేలా పారదర్శకంగా పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, జరుగుతున్న ప్రగతి ప్రజలందరికీ కనిపించేలా పారదర్శకంగా పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రముఖ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయడం శుభసూచికమని ఉపముఖ్యమంత్రి అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం అనేది అరుదైన అంశమని, ఆ ఘనతను అమరావతి సాధించిందని పేర్కొన్నారు. ఈ కేంద్రీకరణ వలన ఆర్థిక లావాదేవీల విషయంలో అందరికీ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మొత్తం రూ. 1334 కోట్ల వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్తు నిర్మాణానికి ఎంతో కీలకం కానున్నాయని ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అపారమైన విశ్వాసంతోనే రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అందించారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అమరావతి పునర్నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, విశాఖ ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్) కోసం నిధులు ఇచ్చి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నూతన కేంద్ర కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాక, దేశంలోనే అగ్రగామి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.






