YS Jagan: ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.. వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో జగన్

by Thanuru Gopichand |

తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు

YS Jagan: ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.. వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS jagan) అన్నారు. వైఎస్సార్సీపీ (YCP formetion day) 15వ ఆవిర్భావ వేడుకలు బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ (YSR) విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దివంగ‌త డాక్టర్​వైఎస్సార్​ ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భవించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌మ భుజ‌స్కందాల‌పై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయ‌కులంద‌రికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ఒక్కడితో మొద‌లై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సుల‌తో శ‌క్తివంత‌మైన రాజ‌కీయ పార్టీగా ఎదిగిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం ప‌నిచేస్తూనే ఉందన్నారు. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజ‌కీయ చ‌రిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయ‌ని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించ‌డం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా నిల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగిందన్నారు. విలువ‌ల‌కు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసంతో తనతో న‌డుస్తున్న పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులంద‌రికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story