- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో BC భారత్ బంద్‌కు పిలుపునిస్తాం.. ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిబద్ధత గల లీడర్ అని బీసీ సంక్షేమ సంఘాల నాయకుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిబద్ధత గల లీడర్ అని బీసీ సంక్షేమ సంఘాల నాయకుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలను ఏకతాటిపైకి తేవడానికి త్వరలోనే ఓ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. ఆ సభకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఆహ్వానించి బీసీలకు న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. ఇక ఏపీలో బీసీల సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా బీసీ భారత్ బంద్‌కు పిలుపునిస్తామని అన్నారు.






