- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ప్రాజెక్టుగా ఇళ్లు నిర్మించి ఇస్తాం : మంత్రి నారాయణ
వేలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ చేపడతామని.. ఆ ప్రాజెక్ట్ ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : వేలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ చేపడతామని.. ఆ ప్రాజెక్ట్ ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నంలోని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి వేలంపేటలో ఆయన సోమవారం పర్యటించారు. పర్యటనలో మంత్రి వెంట మేయర్ పీలా శ్రీనివాస రావు, డిప్యూటీ మేయర్ గోవింద రెడ్డి ఉన్నారు. అందులో భాగంగా పూర్ణా మార్కెట్ సమీపంలోని వేలంపేటలని స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లారు. ఇంట్లో వారిని పలకరించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ తమకు సరైన నివాసాలు లేవని.. దాని వల్ల ఎండా, వానా కాలాల్లో అవస్థలు పడుతున్నామని మంత్రికి వివరించారు. తమకు పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు.
వారి వినతిపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ పట్నంలో స్లమ్ ఏరియాల్లో పర్యటిస్తున్నాం అన్నారు. సీఎం సూచనల మేరకు స్లమ్స్ లో ఉండేవారి పరిస్థితిని తెలుసుకోవడానికి స్వయంగా వచ్చామన్నారు. వేలంపేటలో నివసిస్తున్న వారి పరిస్థితి తన మనసును కదిలించిందన్నారు. అత్యంత దయనీయ స్థితిలో వారు జీవితం సాగించడం బాధాకరమన్నారు. కొన్నేళ్లుగా 177 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయని తెలుసుకున్నాం అన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరపున తగిన సహాయం చేస్తామన్నారు. అందులో భాగంగా 177 కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వేలంపేటవాసుల అవస్థలపై సీఎంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామన్నారు. తద్వారా వారికి పక్కా ఇళ్లను అందిస్తామని హామీనిచ్చారు.






