- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం : వైవీ సుబ్బారెడ్డి
అంబటి రాంబాబు నివాసంపై దాడిని ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్. కేంద్ర హోం శాఖ మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు. అంబటి రాంబాబుపై (Ambati Rambabu) జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన దిల్లీలో మాట్లాడారు. టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు విషయంలో వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. వైసీపీ (YCP) నాయకుడిపై దాడి చేయడాన్ని ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పనితీరును రాక్షస పాలనను తలపిస్తోందని విమర్శించారు. టీడీపీ (TDP) నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. సుమారు 5 గంటల పాటు ఆయన ఇంటి వద్ద గందరగోళాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని విమర్శించారు. కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈ పరిణామాలన్నింటీనీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతామని ప్రకటించారు. రాష్ట్రంలో మాజీ మంత్రికే ప్రాణ రక్షణ కరువైందనే విషయాన్ని కేంద్ర హోం శాఖ (Home Ministry) మంత్రి అమిత్ షాతోపాటు (Amith Shah) ఆ శాఖ కార్యదర్శికి కూడా వివరిస్తామని ప్రకటించారు.






