అన్నం మానేసి.. నీ కోసం వెతుకుతున్నాం..

by Thanuru Gopichand |

నిద్ర అన్నం మానేసి నీకోసం వెతుకుతున్నాం.. అంటూ తిరుపతి దాడి ఘటనలో బాధితుడు పవన్​తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నం మానేసి.. నీ కోసం వెతుకుతున్నాం..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : నిద్ర అన్నం మానేసి నీకోసం వెతుకుతున్నాం.. అంటూ తిరుపతి దాడి ఘటనలో బాధితుడు పవన్​తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ రోజు ఒక వీడియో విడుదల చేశారు. పవన్​ను ప్లాస్టిక్​కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్​మీడయాలో వైరల్​అయ్యాయి. ఆ వీడియోలను తల్లి సునీతకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. పవన్​తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భూమన కరుణాకరరెడ్డి అనుచరులు అనిల్​రెడ్డి, జగదీశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీడియోలు బయటకు వచ్చి 24 గంటలు గడిచినా పవన్​ఆచూకీ తెలియలేదు. దీంతె పవన్​తిరిగి రావాలంటూ తల్లి సునీత వీడియో విడుదల చేశార. దాడి దృశ్యాలు చూసి తను పోలీసులలకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

Next Story