జిల్లాలో డోలీ రహిత గ్రామాలు కావాలి : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

పార్వతీపురం మన్యం జిల్లాలోని (Parvathipuram Manyam District) గ్రామాలు డోలీ రహిత గ్రామాలు కావాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) స్పష్టం చేశారు.

జిల్లాలో డోలీ రహిత గ్రామాలు కావాలి : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం మన్యం జిల్లాలోని (Parvathipuram Manyam District) గ్రామాలు డోలీ రహిత గ్రామాలు కావాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ లో మన్యం జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో జిల్లాలో డోలీ రహిత గ్రామాలను చూడాలన్నారు. ప్రతి గ్రామానికి ఆటో, ఆంబులెన్స్ వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200లకు పైగా గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందన్నారు. మిగిలిన 284 గ్రామాల్లో రానున్న రెండేళ్లలో రహదారుల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రహదారుల నిర్మాణంలో అటవీశాఖ అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులకు లాభసాటి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దార్శనికత, సంకల్పంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ​ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' హామీలు, పెంచిన పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందుతున్న తీరును పరిశీలించామన్నారు. ​పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రతి పౌరుడికి సుపరిపాలన అందించేందుకు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాల అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ​"అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యం, ఫేక్ రాజకీయాలకు చెక్‌! సీఎం చంద్రబాబు నినాదం అని స్పష్టం చేశారు.

Next Story