వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకోవద్దా: బనకచర్లపై CM చంద్రబాబు హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-15 05:20:55  IST  )

విజ‌య‌వాడ‌ (Vijayawada)లోని మున్సిప‌ల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు అట్టహాసంగా జరుగుతున్నాయి.

వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకోవద్దా: బనకచర్లపై CM చంద్రబాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విజ‌య‌వాడ‌ (Vijayawada)లోని మున్సిప‌ల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగ‌ర‌వేసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ.. బనకచర్ల (Banakacharla)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. తాము నిర్మించ తలపెట్టిన బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోని వృథాగా పోయే నీటిని మాత్రమే వినయోగిస్తున్నామని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకొవొద్దా అని చంద్రబాబు అన్నారు.

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరవేసిన చంద్రబాబు

Next Story