- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home Minister Anitha:వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు జీరో నుంచి స్టార్ట్ చేశాం.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita) విమర్శించారు.

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita) విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పోలీసు శాఖకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హోం మంత్రి అనిత చెప్పారు. హనుమంతు వాక వద్ద 17 గదులతో విశాలంగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన ప్రాంగణాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తో కలిసి హోం మంత్రి అనిత నేడు(ఆదివారం) ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ భవనంలో ఏసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అదనపు అంతస్తు నిర్మించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీస్ స్టేషన్ వసతి లోపంతో ఇంతకాలంగా దయనీయ పరిస్థితుల్లో ఉండేదని, ఇప్పుడు విశాల భవనంలోకి మారడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో పోలీస్‌లకు చాలా ప్రాంతాల్లో సరైన వసతి, మెరుగైన వాహనాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఆరిలోవ నూతన పోలీస్ స్టేషన్ కోసం పోలీస్ శాఖ 2.4 కోట్లు కేటాయించారు. ఉద్యోగులు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మిగతా 5. 40 లక్షలు విరాళంగా ఇవ్వడం హర్షదాయకమన్నారు. అలాగే భీమిలి నియోజకవర్గంలోని దివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఫార్మా సిటికల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ కోసం రూ.16 లక్షలు విరాళంగా ఇచ్చారని యాజమాన్యాన్ని అభినందించారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ ఈ పోలీస్ స్టేషన్ వద్ద మెరుగైన రహదారి నిమిత్తం జీవీఎంసీ నుండి కోటి రూపాయల మంజూరుకు కృషి చేస్తానన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, డీఐజీ గోపీనాథ్, డీసీపీ అజిత్, ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, సీఐ మల్లేశ్వరరావు, పోలీసు ఉన్నతాధికారులు, పదో వార్డు కార్పొరేటర్ రామలక్ష్మి పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ సన్యాసిరావు, వార్డు టీడీపీ, బీజేపీ నాయకులు హాజరయ్యారు.






