స్విమ్స్ లో పనులు వేగవంతం చేయాలని నిర్ణయించాం : బీఆర్ నాయుడు

by Thanuru Gopichand |

స్విమ్స్ లో పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు.

స్విమ్స్ లో పనులు వేగవంతం చేయాలని నిర్ణయించాం : బీఆర్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : స్విమ్స్ లో పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆసుపత్రి ఆవరణలో నూతన భవనాలకు ఆయన బుధవారం ప్రారంభించారు. రూ.10.65 కోట్ల నిర్మించన కేంద్రీయ ఔషధ గిడ్డంగి రూ.4.40 కోట్లతో నిర్మించిన రోగుల సాయకుల వసతిని ఆయన ఆందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ స్విమ్స్ ను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారన్నారు. సీఎం ఆదేశాలతో స్విమ్స్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన గుత్తేదారులపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయన్నారు. తిరుపతి బర్డ్ హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

అదే విధంగా సిల్వర్ మాక్స్ సంస్థ టీటీడీకి బ్లేడులు విరాళంగా ఇచ్చిందన్నారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ ఏడాదికి సరిపడ బ్లేడ్లను అందించిందన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో సిల్వర్ మాక్స్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ వాటిని అందజేశారన్నారు. కల్యాణకట్టలో రోజుకు సుమారు 40వేల బ్లేడులు వాడుతున్నామని వెల్లడించారు. ఏడాదికి సరిపడ బ్లేడులను విరాళంగా ఇచ్చిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. సిల్వర్ మాక్స్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఎవరి వద్దా లేన విధంగా సింగిల్ బ్లేడ్ ను తాము తీసుకొచ్చామని తెలిపారు. శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Next Story