నేరాలను నియంత్రించేందుకు టెక్నాలజీని వాడుతున్నాం : హోంమంత్రి అనిత

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.

నేరాలను నియంత్రించేందుకు టెక్నాలజీని వాడుతున్నాం : హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. కాకినాడ జిల్లా తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్, ఆధునీకరించిన సబ్ జైలును యనమల దివ్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇకపై ఏ నేరం చేసిన నిందితులైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత ఐదేళ్లలో జైళ్లలో కనీసం సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి దాదాపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, విజయవాడ కమిషనరేట్ పరిధిలో 7500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వానికి అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని హితవు పలికారు.

Next Story