విపత్తులను ఎదుర్కొనేలా 14వేల మందికి శిక్షణనిస్తున్నాం: హోంమంత్రి అనిత

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది అని ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) పేర్కొన్నారు.

విపత్తులను ఎదుర్కొనేలా 14వేల మందికి శిక్షణనిస్తున్నాం: హోంమంత్రి అనిత
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది అని ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) దుబాయ్(Dubai) నుంచి వీడియో కాన్ఫరెన్స్(Video Conference) ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ.. అవగాహన, అప్రమత్తతతోనే విపత్తులను ఎదుర్కోగలం అని హోంమంత్రి అనిత తెలిపారు. తుపానులు, వరదలు(Floods) వస్తే చేపట్టాల్సిన చర్యలపై విశాఖ(Vishakapatnam) ఎయిర్ పోర్ట్‌(Airport)లో మాక్ డ్రిల్ విపత్తుల వేళ ఎలా వ్యవహరించాలనే దానిపై దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హోంమంత్రి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా స్పందించడంలో, క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించి మరణాలను నిరోధించడంలో జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎయిర్ పోర్ట్(Airport) ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ రూపకల్పన చేస్తోన్నట్లు వివరించారు.

హుద్ హుద్, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలో వేగంగా తిరిగి నిలబడ్డాం అని గుర్తుచేశారు. ఆపద మిత్ర వాలంటీర్లను తీసుకుని వారికి రెస్క్యూ పై శిక్షణ అందించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విపత్తులను ఎదుర్కొనేలా 14 వేల మందికి శిక్షణనిస్తున్నాం అని హోంమంత్రి అనిత తెలిపారు. నేవీ, పోలీస్, రెవెన్యూ, జలవనరులు, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ సహా అన్ని శాఖలతో సమన్వయం గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ‘మే’లోగా శిక్షణ పూర్తి చేస్తామన్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ వల్ల ఆకస్మిక ఆపదలు వస్తే మన సామర్థ్యం ఎంతో లోటుపాట్లను అధిగమించగలమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. అయితే వ్యక్తిగత పర్యటనలో ఉన్నప్పటికీ మాక్ డ్రిల్ ప్రాముఖ్యత దృష్ట్యా హోంమంత్రి అని హాజరయ్యారు.

Next Story