- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధం : మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
అవుకు రిజర్వాయర్ (Avuku Reservior) లీకేజీ అరికట్టడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : అవుకు రిజర్వాయర్ (Avuku Reservior) లీకేజీ అరికట్టడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy) ప్రకటించారు. అవుకు రిజర్వాయర్ ను ఆయన ఆదివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అవుకు రిజర్వాయర్ లో లీకేజీ సమస్య ఉందన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కోటి రూ పాయల వరకు నిధులను విడుదల చేసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. రానున్న పదిహేను ఇరవై రోజుల్లో పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. లీకేజీలను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నిపుణులు పని చేస్తున్నారు. వారు రిజర్వాయర్ అంతటా గాలించి లీకేజీలను గుర్తిస్తారన్నారు. లీకేజీలు నిర్ధారణ అయిన తరువాత వాటిని కాంక్రీట్ తో ఫిట్ చేస్తున్నారని వివరించారు.
లీకేజీలున్న మాట వాస్తవమే..
గత పదిహేనేళ్లుగా అవును రిజర్వాయర్ లో చిన్న చిన్న లీకేజీలు ఉన్నమాట వాస్తవమేనని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. నాడు ఈ లీకేజీలపై దృష్టి పెట్టకపోవడం వల్ల నేడు ప్రమాదకరంగా మారిన పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అవుకు రిజర్వాయర్ ఉన్న పరిస్థితి వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారన్నారు. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం అని.. లీకేజీలను పూర్తి స్థాయిలో అరికడతామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని మంత్రి భరోసానిచ్చారు. ఇంకా వేరే లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. రిజర్వాయర్ కట్ట కూడా కొద్దిగా కుంగిన క్రమంలో నెలాఖరులోపు దాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు. లీకేజీలను అశ్రద్ధ చేయకూడదని ఇప్పటికే తాను రెండుసార్లు స్వయంగా వచ్చి పర్యవేక్షించానని వెల్లడించారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అవుకు రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాని తెలిపారు.






