గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

by Thanuru Gopichand |

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్​ చేశారు.

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్​ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు వారికే దక్కేలా కృషి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని పేర్కొన్నారు. దాని పునరుద్ధరణకు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు

Next Story