- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారం : కేంద్రమంత్రి
సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో (Vengalayapalem) రూ.1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువును కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం, ప్రధాన మంత్రి సించయతీ యోజన వంటి పథకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో అమలు చేయడం జరుగుతుందన్నారు.
వెంగళాయపాలెంలో పురాతన చెరువును పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. జల సంరక్షణ కార్యక్రమాల వలన భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మట్టి సారవంతంగా మారుతుందని చెప్పారు. జల సంరక్షణ కార్యక్రమాలు వలన సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహద పడతాయన్నారు. వెంగళాయపాలెం చెరువు నమూనాను దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) మంచి ఆలోచనా విధానంతో అడుగులు వేస్తూ అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.






