- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో జరిగింది అసలు ఎన్నికేనా.. చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్
పులివెందుల, ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి.

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల, ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. మొత్తం 15 చోట్ల రీపోలింగ్‌కు వైసీపీ డిమాండ్ చేస్తుండగా.. ఈసీ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని కామెంట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ల ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఇంత అన్యాయంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని ఆరోపించారు.
15 పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. పోలీసుల సహాకారంతోనే అంతా జరిగిందని అన్నారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్ల ఫామ్‌లను పోలీసులు లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు ఓటర్లు, దొంగ ఓటర్లను గుర్తించేందకు పోలింగ్ ఏజెంట్లు ఉంటారని.. అసుల వారు లేకుండా ఎన్నిక జరగడం తాను ఎక్కడా చూడలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ పూర్తి అయ్యాక బ్యాలెట్ బాక్స్‌లపైనా ఏంజెట్ సంతకం కూడా పెట్టించలేదని వైఎస్ జగన్ అన్నారు. అసలు పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా.. అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజస్వామ్యం సిగ్గపడేలా ఎన్నికలు జరిగాయని ఎద్దేవా చేశారు. బందిపోటు దొంగలుండే చంబల్ లోయను మరిపించారని.. ఆ దొంగల తరహాలోనే చంద్రబాబు (Chandrababu) ఎన్నికలు జరిపించారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.






