శ్రీవారి భక్తులకు హెచ్చరిక.. మెట్ల మార్గంలో చిరుత కలకలం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-01 05:14:39  IST  )

తిరుమల (Tirumala)లో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.

శ్రీవారి భక్తులకు హెచ్చరిక.. మెట్ల మార్గంలో చిరుత కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala)లో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందళనకు గురవుతున్నారు. అయితే, ఇవాళ ఉదయం 500వ మెట్టు వద్ద పక్కనే ఉన్న చెట్ల పొదల్లో చిరుత (Cheetah) సేద తీరుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న భక్తులు గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందజేశారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది సైరన్‌ (Siren) మోతతో అక్కడి నుంచి చిరుత అడవిలోకి వెళ్లేలా తరిమారు. చిరుత కలకలంతో శ్రీవారి మెట్టు ప్రారంభంలో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను మొదట అధికారులు అనుమతించలేదు. పరిస్థతి పూర్తిగా సద్దుమణిగాక భక్తులను గ్రూపుల వారీగా విభజించి మెట్ల మార్గంలోకి అనుమతించారు.

Next Story