- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధ ప్రభావం.. సిలిండర్ల సరఫరా నిలిపివేత
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది. రేపటి నుంచి కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19.5 కిలోల సిలిండర్లు సరఫరా నిలిపివేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో తిరుపతిలోని 3 వేలకు పైగా హోటల్స్‌పై ప్రభావం పడనుంది. అంతేకాదు.. కొత్తగా కమర్షియల్ ఆర్డర్లు తీసుకోవద్దని, ప్లాంట్ల నుండి సిలిండర్లను తరలించడానికి వాహనాలను పంపవద్దని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.
ఎవరిపై ప్రభావం చూపుతుంది?
ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న, భారీ తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను మాత్రమే హోటళ్లు మరియు పారిశ్రామిక వినియోగదారులకు పంపిణీ చేస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త ఆర్డర్లను ప్రాసెస్ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఇరాన్‌లో అమెరికా దాడుల వల్ల సుమారు 165 మంది చిన్నారులు మరణించినట్లు వెలువడిన వార్తలు కూడా ఉద్రిక్తతలను పెంచాయి.






