- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు.. షర్మిల సంచలన ట్వీట్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ బిల్లులు చెల్లించడం లేదని..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ బిల్లులు చెల్లించడం లేదని.. ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు బ్రేకులు వేసాయి. అయితే.. ఏపీలో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వివాదాస్పద ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఏకీపారేస్తూ... సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు షర్మిల. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు మాత్రం దిక్కే లేదని మండిపడ్డారు షర్మిల ( YS Sharmila).
పేదోడి ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP ) భరోసా అసలు లేదని... ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శలు చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిప్పులు జరిగారు. ఆరోగ్యశ్రీ సేవల కింద 3500 కోట్లు పెండింగ్ లో పెట్టడం నిజంగా సిగ్గుచేటు అంటూ విమర్శలు చేశారు. గడిచిన తొమ్మిది నెలలుగా పూర్తిస్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాక చూడడం ఏంటి అంటూ నిప్పులు జరిగారు షర్మిల.
ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని... ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే.. బకాయిలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు షర్మిల. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి అంటూ డిమాండ్ చేశారు షర్మిల.
పేరుకు రైజింగ్ స్టేట్..కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా…
— YS Sharmila (@realyssharmila) April 7, 2025






