- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vizianagaram: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
by Vemula.Srinu Prasad |
విజయనగరం జిల్లాలో తెల్లవారేసరికి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు...

X
దిశ, వెబ్ డెస్క్: తెల్లవారేసరికి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. హైవేపై వెళ్తుండగా లారీని ఢీకొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అతివేగమో.. నిత్రమత్తో తెలియదు గానీ రెండు ప్రాణాలు గాల్లో కలిచిపోయాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా(Vizianagaram District) డెంకాడ మండలం మోదవలస(Modavalasa)లో జరిగింది. మోదవలస హైవేపై రావాడ వెంకట్రావు, గొర్లె సురేశ్ బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలో ఎదురుగా లారీ(Lorry) వచ్చింది. బైక్(Byke) కంట్రోల్ కాకపోవడతో లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గురైన బైక్ నెంబర్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






