- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తిలో చెల్లికి వాటా.. తల్లిదండ్రులను దారుణంగా చంపిన కుమారుడు
తల్లిదండ్రుల ఆస్తుల్లో కూతురికి కూడా వాటా ఇవ్వాలని గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి..

దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రుల ఆస్తుల్లో(Assets) కూతురికి కూడా వాటా(Share) ఇవ్వాలని గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాలు కొందరు సోదరులు బేఖాతరు చేస్తున్నారు. అంతేకాదు ఆస్తిని ఇచ్చినందుకు తల్లిదండ్రుల(Parents)పై కక్ష పెంచుకుంటున్నారు. క్షణాకావేశంలో దారుణాలకు సైతం పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన విజయనగరం జిల్లా(Vizianagaram Distrcit)లో జరిగింది. పూసపాటిరేగ మండలం నడిపూరకల్లాలు(Nadipurakallalu) గ్రామానికి చెందిన తల్లిదంద్రులు ఇటీవల తన కూతురు(Daughter)కి ఆస్తిలో వాటా ఇచ్చారు.
అయితే చెల్లికి ఆస్తి ఇవ్వడాన్ని కుమారుడు జీర్ణించుకోలేకపోయారు. తనకు దక్కాల్సిన మొత్తం ఆస్తిలో చెల్లికి ఇవ్వడంపై కక్ష పెంచుకున్నారు. దారుణం చంపేశాడు. కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత మార్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆస్తి కోసం తల్లిదండ్రుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన కుమారుడిపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.






