విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన.. డయేరియా బాధితులకు పరామర్శ

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-10-24 03:33:53  IST  )

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గుర్ల చేరుకుని, గ్రామంలో ఇటీవల డయేరియాతో..

విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన.. డయేరియా బాధితులకు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గుర్ల (Gurla) చేరుకుని, గ్రామంలో ఇటీవల డయేరియాతో మరణించిన వారి కుటుంబాలను, డయేరియా బాధితుల్ని పరామర్శించనున్నారు. డయేరియా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారి పరిస్థితుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అలాగే చికిత్స సంబంధిత వివరాలపై ఆరా తీయనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి.. అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం కు చేరుకుని, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ బిగ్ రివీల్ ఉంటుందని నిన్న చేసిన ప్రకటనపై అందరి ఆసక్తి ఉంది. ప్రిపేర్ ఫర్ ది బిగ్ రివీల్ అని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్.. అందరినీ ఏపీ రాజకీయాల వైపు చూసేలా చేసింది. ట్రూత్ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు రాబోతోంది.. స్టే ట్యూన్ అని చేసిన ట్వీట్ సంచలనం రేపింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారాన్ని బయటపెట్టబోతుందోనన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు.

Next Story
null