- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యంలో ఏనుగుల బీభత్సం.. పామాయిల్ తోటలు ధ్వంసం
ఏనుగుల సంచాలం రైతులు, స్థానికుల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏనుగుల సంచాలం రైతులు, స్థానికుల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. సిబిల్లి పెద్దవలస, కాముడువలస గ్రామాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. రైతులు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జూన్ 13న సాలూరు నుంచి ఒడిశాకు వెళ్లిన ఏనుగులు.. మళ్లీ ఒడిశా నుంచి సాలూరుకు చేరాయి. ఈ క్రమంలో కాముడువలసలో పామాయిల్ తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. తోటలో ఉంచిన మోటార్లను కూడా నాశనం చేశాయి. దీంతో తాము కోలుకోలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటి జోలికి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, ఎవరూ కూడా ఏనుగులను తోలడానికి లేదా వాటి జోలికి వెళ్లడానికి ప్రయత్నించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని స్పష్టం చేశారు.






