AP | జనసేన నేత కారు ఢీకొని ఒకరు మృతి

by Thanuru Gopichand |

జనసేన (Janasena) నేతకు చెందిన కారు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో (Parvathipuram) జరిగింది.

AP | జనసేన నేత కారు ఢీకొని ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : జనసేన (Janasena) నేతకు చెందిన కారు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో (Parvathipuram) జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం జనసేన నేత, ఎస్టీ కమిషన్ సభ్యుడు కడ్రక మల్లేశ్వర రావు కారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామం (Gumma Village) సమీపంలో ప్రమాదానికి కారణమైంది. అయ్యప్ప మాలధారణ (Ayyappa Maladharis) చేసిన ముగ్గురిని కారు ఢీకొట్టింది. దీంతో గౌడు హరి అనే అయ్యప్ప మాలధారి మృతి చెందారు. మరో ఇద్దరు అయ్యప్ప మాలధారులు తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు. అయితే ఇరుముడి కట్టుకొని కొండకు ప్రయాణం కానున్న నేపథ్యంలో దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story