Ap Employees Union: ఆ డబ్బు తీయడం నేరం.. సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Ap Employees Union: ఆ డబ్బు తీయడం నేరం.. సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేసే శక్తి ముఖ్యమంత్రికి కాదు కదా? ఎవరికీ లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై గవర్నర్‌ను కలవడానికి వెళ్తే ఏ టెర్రరిస్టునో, సంఘ విద్రోహక శక్తినో కలిసినట్టు భజన సంఘాలు, ప్రభుత్వం భావించటం సరికాదని విమర్శించారు. విజయనగరం జిల్లాలో కేఆర్ సూర్యనారాయణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ డబ్బు డ్రా చేయడం చట్టప్రకారం నేరం

‘మా ఖాతాల్లో డబ్బుని మాకు తెలియకుండా ప్రభుత్వం డ్రా చేయటమంటే చట్టప్రకారం నేరం. బాధ్యులపై చర్యలు తీసుకోమని కొన్నాళ్లుగా ఒత్తిడి చేస్తుంటే భజన సంఘాలతో ప్రభుత్వం పబ్బంగడుపుతోంది. జీపీఎఫ్ సొమ్ముని మా అవసరాలకు చెల్లించమంటే ప్రభుత్వం నరకం చూపిస్తోంది. నెల వారీ జీతభత్యాలు చెల్లించమంటే బాధలకు గురిచేస్తోంది. ప్రతిపక్షాలకు చెప్పిన కాకిలెక్కలు ఆర్ధిక మంత్రి బుగ్గన మాకు చెబుతున్నారు. 12 వేల కోట్ల జీపీఎస్ నిధుల చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించాలి. మమ్మలను నడిపేది రాజకీయ శక్తి కాదు. 12 లక్షల మంది ఉద్యోగ కుటుంబాల శక్తి.’ అని కేఆర్ సూర్యనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed