- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash : సిరిమానోత్సవంలో అపశృతి.. కూలిన వేదిక
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలింది. సిరిమానోత్సవాన్ని తిలకిస్తుండగా వేదిక కూలడంతో ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు ఆందోళన చెందారు.
సిరిమానోత్సవం ప్రారంభానికి ముందే భారీ వర్షం కురవగా భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా సిరిమాను ఊరేగింపునకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. కాగా.. వర్షం కారణంగానే వేదిక కూలిందా ? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
కాసేపటికి వేదిక వద్ద పరిస్థితి చక్కబడటంతో.. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతిపక్ష నేత బొత్ససత్యనారాయణ ఉత్సవాన్ని తిలకించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని, అందరూ సేఫ్ గానే ఉన్నారని పోలీసులు తెలిపారు.
Next Story






