Vizag Steel Plant | ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా మాట్లాడటం తగదు

by Thanuru Gopichand |   (  Updated:2025-11-17 03:24:13  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) అన్నారు.

Vizag Steel Plant | ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా మాట్లాడటం తగదు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Visakapatnam Steel Plant) నష్టాల్లో ఉన్నదాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు రూ. 14 వేల కోట్లు తీసుకొచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుందన్నారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు, ప్లాంట్ ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి రూ.14 వేల కోట్లల్లో రూ.11 వేల కోట్లు ఇప్పటికే తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి కూడా సుమారు రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 30 శాతం పనులు జరుగుతున్న ప్లాంట్ లో 80 శాతం పనులు జరిగేలా చేశామని వివరించారు. పబ్లిక్ సెక్టార్ లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్ మెంట్ (Management), కార్మికులు (Workers) బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారని పేర్కొన్నారు. లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలబాటలో నడుస్తోందన్నారు. కార్మికులు, ప్రజానీకం, స్టీల్ ప్లాంట్ లోని వారందరు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Next Story