సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్‌కు బిగ్ షాక్

by Naga Rani Yarlagadda |

విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కు కేటాయించిన భూముల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సురేష్ ప్రొడక్షన్స్ కు ఊరట దక్కలేదు.

సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్‌కు బిగ్ షాక్
X

విశాఖలో ఉన్న రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం (Ramanaidu Studio Lands Case) సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. గతంలో వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్‌కు ఫిల్మ్ సిటీ (Vizag Film City) కోసం కేటాయించిన భూముల్ని ఇతర అవసరాలకు కూడా వాడుకునేందుకు అనుమతిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) జరుగుతుందని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసి.. సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. షోకాజు నోటీసులపై (Show Cause Notice) మధ్యంతర ఉపశమనం కుదరదని చెప్పింది. కావాలనుకుంటే షోకాజు నోటీసులపై సంబంధిత కోర్టు ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. అనంతరం తమ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ కోర్టుకు తెలిపింది.

Next Story