Vishakha Port: విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు.. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్

by Shiva |
Vishakha Port: విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు.. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ (Kakinada) సీ పోర్టు (Sea Port)లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన మరువక ముందే మరో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. ఇవాళ ఉదయం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) విశాఖ పోర్టు (Vishakha Port)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఇతర దేశాలకు తరలిస్తున్న కంటైనర్ టెర్మినల్‌ (Container Terminal)లో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని (PDS Rice) గుర్తించారు.

ఉత్తరాంధ్ర, ఒరిస్సా (Orissa)ల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని విశాఖ పోర్టు (Vishakha Port) నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా మంత్రి, అధికారులు గుర్తించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఆదేశాల మేరకు పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ముఠా నాయకుడు ఎవరనే విషయాన్ని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. అదేవిధంగా విశాఖ పోర్టులో పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు మొత్తం నాలుగు బృందాలను రంగంలోకి దింపనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed