Walther Division: ఒడిశా ప్రమాదం మానవతప్పిదం కాదు: డీఆర్ఎం అనూప్ కుమార్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-03 14:14:13  IST  )

ఒడిశా రైలు ప్రమాదం దురదృష్టకరమని వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి అన్నారు...

Walther Division: ఒడిశా ప్రమాదం మానవతప్పిదం కాదు: డీఆర్ఎం అనూప్ కుమార్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఒడిశా రైలు ప్రమాదం దురదృష్టకరమని వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఎలాంటి మానవ తప్పిదం ఉండే అవకాశం లేదని, సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందని చెప్పారు. భారతీయ రైల్వేలో ఇది అతి పెద్ద ప్రమాదమన్నారు. పూర్తిస్థాయిలో రి స్టోర్ కావటానికి మరొక 24 గంటలు సమయం పడుతుందని తెలిపారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో గాయాలు కాకుండా ఉన్నటువంటి మిగతా వారిని, స్వల్ప గాయాలైన వారిని మరో ట్రైన్‌లో తీసుకువస్తున్నట్లు చెప్పారు. సాయంత్రానికి వారు విశాఖ చేరుకుంటారని, చివరి డెస్టినేషన్ వరకు ట్రైన్ వెళుతుందని డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

Next Story