- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోమాంసం నిల్వలపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్
గోమాంసం నిల్వలపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: గోమాంసం నిల్వల(Beef reserves)పై విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సీరియస్ అయింది. వెంటనే నిల్వలను ఆపివేయాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటన విశాఖలో జరిగింది. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్(Srimitra Cold Storage)లో కొంతకాలంగా గో మాంసం నిల్వలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గోమాంసం నిల్వ చేయొద్దని విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే రెండు, మూడు సార్లు హెచ్చరించింది. అయినప్పటికీ గోమాంసం నిల్వ ఉంచుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆందోళనకు దిగారు. గోమాంసం నిల్వలను వెంటనే నిలిపివేయాలంటూ స్టోరేజ్ లోపలికి సొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కొంతసేపు స్టోరేజ్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోమాంసం నిల్వల బాధ్యులపై 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. హిందూ దేశ ద్రోహులారా ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






